చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో “లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్” కార్యక్రమం

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా “లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్” కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో ప్రయాణం చేయనున్నారు టీడీపీ సానుభూతి పరులు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చేయనున్నారు.

ఇందులో భాగంగానే.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు మద్దతుగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ లో నల్ల టీ షర్ట్ లతో ప్రయాణించేందుకు టీడీపీ సానుభూతి పరులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలోనే.. మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు పోలీసులు. టెక్నికల్ రీసన్ చెబుతూ మెట్రో స్టేషన్ ను మూసివేస్తున్నారు అధికారులు. మెట్రో అధికారులతో వాగ్వాదానికి దిగారు చంద్రబాబు మద్దతుదారులు. ఈ తరుణంలోనే.. చంద్రబాబు మద్దతుదారులు మరియు పోలీసుల మధ్య వివాదం రాజుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version