BREAKING: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీలో బిగ్‌ ట్విస్ట్‌..!

-

Big twist in Pinnelli Ramakrishna Reddy custody: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఎన్నికల నేపధ్యంలో పల్నాడు లో జరిగిన విధ్వంసాలు, హత్యాయత్నాలకు సంబంధించిన కేసులపై పిన్నెల్లిని పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు.

Big twist in Pinnelli Ramakrishna Reddy custody

ఇక తమ కస్టడీకి ఇస్తే మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని న్యాయస్థానానికి చెప్పారు పోలీసులు. మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టులో ఈ వాదనలు జరిగాయి. ఇక ఈ తీర్పును నేటికీ వాయిదా వేశారు న్యాయమూర్తి.

అటు యనమలకుదురు పీసీబీ, మైనింగ్ శాఖ కార్యాలయానికి చెందిన ఫైల్స్‌, రిపోర్టులను సిబ్బంది కృష్ణానది కరకట్టపై దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో ఇప్పటికే డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పీసీబీ ఓఎస్డీ రామారావు ఆదేశాలతోనే ఫైల్స్, రిపోర్డులను దగ్ధం చేసిన అని డ్రైవర్ చెప్పడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news