వైఎస్ వివేకా హత్య ఘటనపై బయోపిక్ ?

-

సీబీఐ ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాల ఆధారంగా మాజీ మంత్రి వై.యస్ వివేకానంద రెడ్డి గారి బయోపిక్ ను రూపొందించినట్లుగా మేకర్స్ పేర్కొన్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. సామాజిక మాధ్యమం వేదికగా వై.యస్ వివేకానంద రెడ్డి గారి బయోపిక్ టీజర్ ను విడుదల చేశారని, ఈ నెల 22వ తేదీన యూట్యూబ్ మాధ్యమంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పారన్నారు.

టీజర్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో చాలా స్పష్టంగా అర్థమయిందని, వై.యస్. వివేకనంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు తెల్లవారుజామున కొంత మంది.. కొంత మందితో ఫోన్లో మాట్లాడినట్లుగా సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడం జరిగిందని, అలాగే దస్తగిరి కదిరికి వెళ్లి గొడ్డలి తెచ్చినట్లుగా తన వాంగ్మూలంలో వెల్లడించాడని, ఈ విషయాలన్నీ చిత్రంలో ప్రస్తావించడం ద్వారా, ప్రజలకు కొన్ని నమ్మలేని నిజాలు, సాక్షి రాతలు అబద్ధాలని తెలిసే అవకాశం ఉందని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news