ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి పార్టీ శ్రేణులలో జోష్ తీసుకురావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మించి వచ్చే ఎన్నికలలో బలంగా వైసీపీతో తలబడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే నేడు రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి – జనసేన పొత్తు కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు.
జనసేనతో పొత్తు ఇవాళే కాదు రేపు కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక మిగిలిన పార్టీలతో పొత్తు అంశం కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇక తనని అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. కేంద్ర నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని మరోసారి ఆరోపించారు పురందేశ్వరి. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో వైసిపి ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.