విజయవాడ వరదల్లో బోట్ల దందా…రూ.4000 వరకు వసూలు !

-

Boats in Vijayawada floods: విజయవాడ వరదల్లో బోట్ల దందా కొనసాగుతోంది. రూ.1500 నుండి రూ.4000 వరకు వసూలు చేస్తున్నారు విజయవాడ బోట్ల యజమానులు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మరీ ఒక్క బోటుకు రూ.1500 నుండి రూ.4000 వరకు వసూలు చేస్తున్న తరుణంలోనే.. ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు.

Boats in Vijayawada floods

కాగా, ఆంధ్రాలో తుపాను ధాటికి విజయవాడ,గుంటూరు, అమరావతి, రాజధానిలోని పలు ప్రాంతాలు భారీగా నీటమునిగాయి.దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి మొత్తం నీరు చేరడంతో రాత్రంతా నిద్రలేకుండా జాగారం చేసినట్లు సమాచారం. వరదలు ఒక్కసారిగా విజయవాడను ముంచెత్తడంతో అక్కడి ప్రజలు బిల్డింగ్ పైకి చేరుకుని రక్షించాలని వేడుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కొందరిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించగా..మరికొందరు ప్రజలు ఇప్పటికే ముంపు ప్రదేశాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version