రైతులు ఇలా 60 శతం సబ్సిడీని పొందొచ్చు.. దరఖాస్తు చేసుకోండి..!

-

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పలు స్కీమ్స్ ని తీసుకువచ్చింది. ఈ స్కీముల వలన చాలామంది రైతులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. కేంద్రం రైతుల కోసం పీఎం కుసుమ్ యోజన స్కీముని తీసుకు వచ్చారు. ఈ స్కీముని 2019 మార్చిలో ప్రారంభించారు. దీని ద్వారా రైతుల వ్యవసాయం కోసం సోలార్ వ్యవసాయ పంపులను సబ్సిడీ ధరకు పొందవచ్చు. ప్రతి రైతుకి కేంద్రం 60% తగ్గింపుని అందిస్తోంది. పంపు సెట్లు వేసుకోవడానికి ట్యూబ్, బావులు వేసుకోవడానికి కేంద్రం 60 శాతం సబ్సిడీ ఇస్తుంది.

మరో 30 శాతాన్ని లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఈ లోన్ కేంద్రమే ఇప్పిస్తుంది. మిగతా 10 శాతం రైతు పెట్టుకోవాల్సి ఉంటుంది. లక్షల రైతులకి అత్యధిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ఈ పథకాన్ని కేంద్రం మొదలుపెట్టింది. వ్యవసాయ రంగానికి డిజిటలైజ్ చేయడం సోలార్ పంపులు రైతులకు మరింత ప్రభావితమైన పర్యావరణ అనుకూలమైన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఇవి సురక్షితమైన విద్యుత్ ని ఉత్పత్తి చూస్తాయి.

ఈ పంపు సెట్లు డీజిల్ తో నడిపే పంపులు కంటే ఎక్కువ కరెంట్ ని ఉత్పత్తి చేసే పవర్ గ్రిడ్ ని కలిగి ఉంటాయి. అందుకని సోలార్ పవర్ ద్వారా రైతుల పొందే అదనపు కరెంట్ ని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. స్వయంగా స్థానిక డిస్కంలు కొంటాయి. ఈ పథకంలో మూడు భాగాలు ఉన్నాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం రెండు వెబ్సైట్లని కూడా తీసుకు వచ్చింది.

https://pmkusum.mnre.gov.in/landing-about.html లో పూర్తి వివరాలు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ కోసం పోర్టల్ అయితే తెరవలేదు తెలంగాణ రైతుల కోసం ప్రత్యేకించి పోర్టల్ తీసుకువచ్చింది. ఏపీ రైతులు https://pmkusum.mnre.gov.in/landing-about.html లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version