బొత్స సత్య నారాయణకు గుండె సమస్య..హైదరాబాద్‌ తరలింపు !

-

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె సమస్య వచ్చిందని తెలుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హుటాహుటిన కుమారుడితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.

Botsa Satya Narayana has a heart problem

అయితే ప్రస్తుతానికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చాక గుండెకు స్టెంట్లు వేయాలా…. శస్త్ర చికిత్స చేయాలా….అన్నది నిర్ణయిస్తారని సంబంధిత వర్గాల నుంచి తెలిసింది. అయితే.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం గురించి తెలిసాక… ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం ఎలా ఉందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యంపై సీఎం జగన్‌ కూడా ఆరా తీసారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news