ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఆయన జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నాయి.
దీంతో రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని తెలిపాయి. ఫిబ్రవరి 6వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా వివిధ అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
2025-26 బడ్జెట్ నీ ప్రవేశపెట్టేందుకు, ఏపీ శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు, బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా త్వరలో రాష్ట్రంలో ప్రారంభించనున్న సంక్షేమ పథకాల పైన ఈ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చు అని సీఎమ్ంవో వర్గాలు వెల్లడించాయి.