భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించిన 4జీ టెక్నాలజీని వినియోగించుకుంటున్న బీఎస్ఎన్ఎల్..తాజాగా 4జీ సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. అయితే,5జీ కోసం ఎదురుచూస్తున్న తమ ప్రియమైన వినియోగదారుల కోసం 2025 సంక్రాంతి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఈమేరకు ఏపీ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను ఈ విషయాన్ని స్పష్టంచేశారు.
అతి త్వరలోనే 5జీ సేవల కోసం కొత్త టవర్లు, హై టెక్నాలజీ పరికరాలను రీప్లేస్ చేస్తామన్నారు.అయితే, వినియోగదారులు ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండా 4జీ నుంచి 5జీకి అప్డేట్ అయ్యే టెక్నాలజీని తీసుకొస్తున్నామన్నారు. ఇదిలాఉండగా, ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఇండియా వంటి కంపెనీలు టారిఫ్ చార్జీలను విపరీతంగా పెంచడంతో మొబైల్ ఆపరేటర్లు బీఎస్ఎన్ఎల్‌కు మారుతున్న విషయం తెలిసిందే.