ప్రపంచంలోనే అతి చిన్న పార్క్.. రెండు అడుగులు, ఒకే ఒక్క మెుక్క

-

మనం నివసించే ప్రదేశంలో పార్కులు కనిపిస్తుంటాయి. చిన్న పార్క్ అయితే ఎన్నో కొన్ని చెట్లు ఉంటాయి. నడిచేందుకు కనీసం ఐదు పది నిమిషాలు పడుతుంది. పార్కులు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఉదయం, సాయంత్రం నడక కోసం చాలా మంది వెళ్తుంటారు. పార్క్ వాతావరణం చాలా ప్రశాంతంగా, స్వచ్ఛమైన గాలితో ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి పార్కుకు వెళతారు, పెద్దలు నడవడానికి లేదా కొంతమంది స్నేహితులను సందర్శించడానికి వెళతారు. పనిలో ఒత్తిడికి గురైన వ్యక్తులు విశ్రాంతి తీసుకోవడానికి పార్కుకు వస్తారు. ఇవన్నీ సాధారణంగా మనం పార్కుల్లో చూస్తుంటాం. అందులో ఎన్నో చెట్లు ఉంటాయి. కానీ ఒకే ఒక్క మెుక్కతో ఉన్న పార్క్ గురించి మీకు తెలుసా? ప్రపంచంలోనే ఇది అతి చిన్నది.

ప్రపంచంలోనే అతి చిన్న పార్కు ఒకటి ఉంది. పార్క్ చాలా చిన్నది, కూర్చోవడానికి లేదా చుట్టూ నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతి చిన్న పార్కులో ఒకే ఒక్క మొక్క ఉంది. ఈ పార్క్ పేరు ‘మిల్ ఎండ్స్ పార్క్’ (Mill Ends Park). మిల్ ఎండ్స్ పార్క్ USAలోని ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉంది.
దీనిని మొదటిసారిగా 1948లో పార్కుగా ప్రకటించారు. 1976లో ఈ పార్క్ ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. మిల్ ఎండ్స్ పార్క్ అని పేరు పెట్టబడిన ఈ చిన్న పార్క్ 1946లో డిక్ ఫాగన్ అనే వ్యక్తి స్థాపించారు. డిక్ ఫాగన్ ఆర్మీలో ఉండేవాడు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అతను ఒరెగాన్‌కు తిరిగి వచ్చాడు. ఒరెగాన్ జర్నల్‌లో జర్నలిస్టుగా పనిచేయడం ప్రారంభించాడు.

కార్యాలయం ఎదుట భారీగా ట్రాఫిక్‌ నెలకొంది. అక్కడే స్ట్రీట్ లైట్ కోసం గొయ్యి తవ్వి ఉంది. కానీ స్తంభం మాత్రం ఏర్పాటు చేయలేదు. ఆ ప్రదేశంలో డిక్ ఫాగన్ ఒక చెట్టును నాటాలని నిర్ణయించుకున్నాడు.
అదే సమయంలో డిక్ ఫాగన్ వార్తాపత్రిక కోసం ఒక వ్యాసం రాశాడు. నగరంలోని వివిధ పార్కుల గురించి పంచుకునేవాడు. నేను ఒకే మొక్కతో పార్క్ మెుదలుపెట్టానని వ్యాసం రాశాడు. ఈ పార్కుకు మిల్ ఎండ్స్ అని పేరు కూడా పెట్టారు. ఫాగన్ 1969లో మరణించాడు. కానీ అప్పటి వరకు అతను పార్కుల గురించి రాస్తూనే ఉన్నాడు. అతడు చనిపోయిన తర్వాత కూడా దానిని పార్క్ గానే కొనసాగించారు. ఈ చిన్న పార్క్ కేవలం 2 అడుగుల వెడల్పు మాత్రమే. ఈ మొత్తం వైశాల్యం 452 చదరపు అంగుళాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version