ఏపీలో విషాదం..ప్రియురాలి కోసం బీటెక్ విద్యార్థి ఆత్మహత్య !

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి కోసం బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రేమించిన యువతిని వివాహం చేసుకునేందుకు పెద్దలు గడువు విధించడంతో మనస్తాపం చెందిన బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

BTech student commits suicide for girlfriend

కొండపల్లి శ్రామిక నగర్ (కొత్తగేటు)లో నివసిస్తున్న వేముల హేమంత్ ప్రసాద్ (19) బీటెక్ చదువుతున్నాడు. కొంతకాలం నుంచి ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. విషయం పెద్దలకు చెప్పి వివాహం చేయాలని కోరగా వారు కొంతకాలం ఆగాలని చెప్పారు. మనస్తాపం చెందిన హేమంత్ ప్రసాద్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చి వీటిపిఎస్ కెనాల్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version