ముగిసిన ఇజ్రాయెల్-హమాస్ సంధి.. గాజాలో మళ్లీ యుద్ధం షురూ

-

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఇవాళ ఉదయంతో ముగిసింది. సంధి ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ మళ్లీ భూతల దాడులను ప్రారంభించింది. అయితే ఈ ఒప్పందం పొడిగింపుపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రావడంతో సంధి ముగిసి మళ్లీ యుద్ధం షురూ అయింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరువర్గాలు తమ చెరలో ఉన్న బంధీలను విడుదల చేశారు.

ఖతార్‌, ఈజిప్టు వంటి దేశాల దౌత్య యత్నాలతో హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెల్, ఇతర దేశస్థుల బందీల విడుదల కోసం గాజాలో కాల్పుల విరమణ డీల్‌కు ఇజ్రాయెల్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ చేపట్టేందుకు మొదట ఇజ్రాయెల్‌ సమ్మతించించగా.. ఆ తర్వాత దీన్ని మరో రెండు సార్లు పొడిగించారు. మొత్తం వారం రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగింది. ఈ సంధికాలంలో కాలంలో హమాస్‌ 100 మందికి పైగా బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్‌ 240 మందికి పైగా పాలస్తీనా వాసులను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version