వైసీపీలో… ఒక పెయిడ్ వర్కర్ – బుద్దా వెంకన్న

-

గుట్కా నాని వైసీపీలో ఒక పెయిడ్ వర్కర్ అని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మాజీ మంత్రి గుట్కా నానికి మతి భ్రమించిందని… గుట్కా నాని గురించి గుడివాడ బస్టాండులో ఎవరిని అడిగినా చెప్తారని విమర్శలు చేశారు. అప్పుల ఊబిలో ఉన్న నాని ఇప్పుడు రూ. 100 కోట్లు ఎలా సంపాదించారు..? చంద్రబాబు, లోకేషుని నాని తిడుతున్నాడని మండిపడ్డారు.

గుట్కా నాని 

జె టాక్స్ వేయకుండా జగన్ నానికి డబ్బులు దోచుకోమని అవకాశం ఇచ్చారు..గుట్కా నాని వైసీపీలో ఒక పెయిడ్ వర్కర్ అని ఆగ్రహించారు. నానిని చూసి గుట్కా అమ్మే షాప్ వాడు కూడా చీదరించుకుంటున్నాడని.. నాని ప్రతి దానిని వ్యాపార కోణంలోనే చూస్తాడని ఆగ్రహించారు.

నానిని తెలుగు రాష్ట్రాల వారు పిచ్చి వాడిలా చూస్తున్నారు… ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాకుండా వారి ఆస్తులు పెంచుకోవడానికి బొత్స, ధర్మాన,అమర్నాధ్ వంటి వారు టీడీపీపై, రైతుల పాదయాత్రపై విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ముందు ఒక రాజధాని కట్టి తర్వాత 30 రాజధానులు కట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version