తిరుమల శ్రీ వారి లడ్డులో వాడే ఉప్పు, శనగపిండి, పంచదార కూడా కల్తీ కావచ్చు అంటూ బాంబ్ పేల్చారు బీవీ రాఘవులు. సీతారాం ఏచూరి సంతాప సభలో బీవీ రాఘవులు మాట్లాడుతూ… నాలుగు రోజులుగా లడ్డూ గొడవ జరుగుతోందని… లడ్డు అంశంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆగ్రహించారు. లడ్డులో వాడే ఉప్పు, శనగపిండి, పంచదార కూడా కల్తీ కావచ్చు….ధనవంతుడైన ఆ దేవుడి దగ్గర పందికొక్కులన్నీ చేరాయని సీరియస్ అయ్యారు. పవిత్రత అంటూ మాట్లాడితే టిటిడి లో చాలా ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక… అనేది ఖర్చులు తగ్గడం కోసమట.. ప్రజాస్వామ్యం పోయినా ఫర్లేదా…అంటూ ఫైర్ అయ్యారు. ఖర్చు కోసం ప్రాణాలు తీసేయాలన్న హిట్లర్ వాదనలాగా మోదీ వాదన ఉందని ఆగ్రహించారు. అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని, అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ నిప్పులు చెరిగారు బీవీ రాఘవులు. ఒకే దేశం ఒకే ఎన్నిక వాదన వల్ల.. దేశం ఐక్యంగా ఉండదన్నారు.