టీడీపీ పార్టీ ఎంపీ మాగుంటకు సర్జరీ..వీడియో విడుదల !

-

నేడు టీడీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులుకు బైపాస్ సర్జరీ చేయనున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులుకు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గుండెకు సంబంధించిన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు. అయితే.. ఇలాంటి నేపథ్యంలోనే…. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈ రోజు అంటే గురువారం హార్ట్ బైపాస్ సర్జరీ జరగనుంది.

Bypass surgery for TDP Ongole MP Magunta Srinivas today

ఈ మేరకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఓ వీడియో కూడా విడుల చేశారు. తన హార్ట్ బైపాస్ సర్జరీ పట్ల ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని కోరారు. ‘కొన్ని రోజుల క్రితం నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. హార్ట్‌ బైపాస్‌ సర్జరీ చేయాలని సూచించారు. దీంతో ఈరోజు చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో హార్ట్‌ ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్ సాఫీగా జరిగిపోతుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.’ అంటూ తెలిపారు హార్ట్ బైపాస్ సర్జరీ.

Read more RELATED
Recommended to you

Latest news