కృష్ణా నదిపై తీగల వంతెనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన (ఐకానిక్‌ హైబ్రిడ్‌ కేబుల్‌ బ్రిడ్జి) నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారుల సంస్థ రూపొందించిన డీపీఆర్ ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తాజాగా ఆమోదించినట్లు తెలిసింది. వంతెన నిర్మాణంతోపాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.1,519.47 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు, పర్యాటకాభివృద్ధి పనులకు రూ.436.91 కోట్లు కేటాయించింది.

కృష్ణా నదిపై తెలంగాణలోని సోమశిల, ఆంధ్రప్రదేశ్‌లోని సిద్ధేశ్వరం గుట్టల మధ్య 1.08 కిలోమీటర్ల మేరకు తీగల వంతెన నిర్మించనున్నారు. ఈ మార్గానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబర్‌ కేటాయించింది. వంతెన నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థ చేపడుతుంది. టెండర్లు ఆహ్వానించేందుకు కసరత్తు చేపట్టాల్సిందిగా కేంద్ర మంత్రిత్వశాఖ అధికారులకు సంస్థ వర్తమానం పంపినట్లు సమాచారం. వంతెన నిర్మాణంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మరింత సులువైన మార్గం ఏర్పడటంతో పాటు తెలంగాణ నుంచి తిరుపతికి కనీసం 70-80 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version