రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయింది. జగన్ రాప్తాడు పర్యటనలో భాగంగా హెలిపాడ్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు సరిగా లేవని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదంటున్నారు పోలీసులు. హెలిపాడ్ నిర్వహణపై మాజీ ఎమ్మెల్యేకు స్వయంగా చెప్పారు DSP.

జగన్ హెలికాప్టర్ లో వచ్చిన సమయంలో బారికేడ్లు తీసుకొని లోపలికి దూసుకొచ్చారు కార్యకర్తలు. ఈ తరుణంలోనే కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కానిస్టేబుల్ నరేంద్రకు గాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు చేసారు పోలీసులు.