మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబుకు సంబంధించిన ఓ ఫామ్ హౌస్ విషయంలో… ఈ వివాదం రాజుకుంటుందని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ తాజాగా సెటైరికల్ ట్వీట్ చేశాడు.

మీ క్యాలెండర్లలో జూలై 17వ తేదీని మార్క్ చేసుకోండి.. జూన్ 27వ తేదీన బిగ్ స్క్రీన్ లోకి దొంగప్ప… అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ రిలీజ్ జూలై 17వ తేదీ న లేక జూన్ 27వ తేదీన అంటూ పేర్కొన్నారు. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా ప్లానింగ్ కేక అంటూ సోషల్ మీడియాలో మంచు మనోజ్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.