ఏపీకి కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పోలవరం తొలిదశ పూర్తికి నిధుల విడుదలపై కేంద్రం అంగీకారం తెలిపింది. పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని వెల్లడించారు అధికారులు.
రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమోరాండం జారీచేసిందని, దీన్ని కేంద్ర జలశాఖకు లేఖద్వారా తెలిపిందని వెల్లడించారు ఏపీ అధికారులు. గత ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతంలో నిర్మాణాలకోసం అదనంగా రూ.౨వేల కోట్లు ఇందులో భాగంగా ఇచ్చిందని పేర్కొన్నారు. కాంపౌండ్‌వారీ బిల్లుల చెల్లింపు వల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్నిపరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు కూడా ఇచ్చిందని తెలిపారు.