చంద్రబాబు కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం

-

చంద్రబాబు నేతృత్వంలో 24 మందితో రాష్ట్ర కేబినెట్‌ కొలువుదీరనుంది. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. కాగా, కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు చోటు లభించింది. వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్. సవితకు అవకాశం లభించింది. ఇక 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. వీరిలో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

Chance of three women in Chandrababu’s cabinet

కాగా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో… జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు… బిజెపికి ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. అంతేకాకుండా 17 మంది కొత్త వారికి మంత్రి పదవులు ఈసారి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news