మంత్రి సురేష్ పై చంద్రబాబు దాడి చేయించాడు – మేరుగ నాగార్జున

-

ప్రకాశం: టిడిపి అధినేత నారా చంద్రబాబు ఒక వీధి రౌడీలా ప్రవర్తించడం రాష్ట్ర ప్రజలందరూ చూశారని అన్నారు మంత్రి మెరుగ నాగార్జున. నేడు మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి సురేష్ దళితుల్లో కడిగిన ముత్యం అన్నారు. మంత్రి సురేష్ పై చంద్రబాబు నిలబడి దాడి చేయించాడని ఆరోపించారు నాగార్జున. ఇది ఒక నీచమైన చర్య అంటూ మండిపడ్డారు. నలభై ఐదేళ్లు అనుభవం ఉందని చెప్పుకునే ఓ దరిద్రుడు రాజకీయ జ్ఞానాన్ని పక్కన పెట్టి దళితుల మీద దాడి చేయించటం దళిత జాతి మార్చిపోదన్నారు.

దళితులు చంద్రబాబును పరిగెత్తిస్తారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి చట్టాల గురించి తెలియదా..? అని ప్రశ్నించారు. ఏపీలో దళితులు జగన్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. మంత్రి సురేష్ చొక్కా విప్పాడో.. చొక్కాలు చించారో.. ఎవరు లాగారో చూడాలన్నారు. మంత్రి సురేష్ గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారని.. ఆయనకు తెలియదా..? అని అన్నారు. ఎవరికి నచ్చినా ఆ పార్టీలోకి వెళ్లొచ్చని.. ఎవరు ఉన్నా.. వెళ్ళినా.. ఓ సుస్థిరమైన స్థానం సీఎం జగన్ కు ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version