BREAKING : ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. అయితే, చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్.. నేడు విచారణ చేయనుంది న్యాయస్థానం. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

Chandrababu Naidu

ఇక ఇవాళ పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లనున్నారు. ముందుగా వీరు ముగ్గురు రాజమహేంద్రవరంలో భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.

ఇవాళ ఉదయం పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం బాలయ్య, పవన్‌ రాజమహేంద్రవరంలోనే ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌లను పరామర్శిస్తారు. అక్కడి నుంచి పవన్‌, బాలకృష్ణ, లోకేశ్‌ కలిసి కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్‌ కానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version