ఎస్సీల కోసం ప్రత్యేకంగా గురుకులాలు పెట్టిన ఘనత ఎన్టీఆర్ దన్నారు చంద్రబాబు. ఎస్సీలకు టీడీపీ చేసినన్ని మంచి పనులు ఇంకెవరు చేయలేదని.. ఎస్సీ సంక్షేమం కోసం మనం చేసిన పనులను చెప్పుకోవడంలో విఫలం అయ్యాయని వెల్లడించారు. ఈ సమావేశం పెట్టుకున్నాం.. అంతా మాట్లాడేసుకున్నామంటే కుదరదన్నారు. హౌసింగులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పించిన పార్టీ టీడీపీ అని.. ఎస్సీల కోసం ప్రత్యేకంగా గురుకులాలు పెట్టిన ఘనత ఎన్టీఆరుదని వివరించారు.
అంబేద్కర్ రాజ్యాంగం రాసినా.. దాన్ని అమలు చేయని పరిస్థితి ఉంటే.. నేను జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశామని.. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేసి.. అంటరానితనాన్ని రూపుమాపామని వెల్లడించారు. సమాజంలో ఎస్సీలను అంటరానివారిగా చూస్తే.. వారికి కఠిన శిక్షలు వేశామని.. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్ను నిర్వీర్వం చేసిందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. జగన్ ప్రభుత్వం ఎస్సీల కోసం ప్రత్యేకంగా ఒక్క పథకమైనా ఇచ్చారా..? అని నిలదీశారు.