అవినాష్ రెడ్డి హత్య చేశాడని తీర్పు వస్తే.. రాజీమానా చేస్తానని సంచలన ప్రకటన చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. టీడీపీ నేతలు నా రాజీనామా కోసం ఎదురు చూస్తున్నారు…ఎందుకు చేయాలి…దేనికి చేయాలని ఫైర్ అయ్యారు.
హత్య చేసింది ఎర్ర గంగిరెడ్డి ఇంకా ఇతరులు అని వెల్లడించారు. సాక్ష్యాలను ధ్వంసం చేశాడని అవినాష్ పై సీబీఐ అభియోగమమన్నారు. అవినాష్ ను ఇరికించవచ్చు.. ఒక వేళ అవినాష్ నేర చేశాడని తీర్పు ఇస్తే నేను రాజీనామా చేస్తానని ఆ రోజు చెప్పా…ఈ రోజు చెప్తున్నానని పేర్కొన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.