చంద్రబాబు అరెస్టుకు నెల రోజులు పూర్తి.. నవంబర్ వరకు !

-

చంద్రబాబు అరెస్టుకు నెల రోజులు పూర్తి అయింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ నేటికీ నెల రోజులు అయింది. గత నెల 9న ఉదయం 6:15 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు సిఐడి ప్రకటించింది. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రోడ్డు మార్గాన విజయవాడ తీసుకెళ్లారు.

These are the questions asked by the CID team to Chandrababu
These are the questions asked by the CID team to Chandrababu

10న ఉదయం 6 గంటలకు ACB కోర్టులో హాజరుపరచగా…. జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ సాయంత్రం 6:45 గంటలకు తీర్పు వెలువడింది. అర్ధరాత్రి 1:20 గంటలకు ఆయన జైల్లోకి వెళ్లారు. ఇది ఇలా ఉండగా, చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుపై ఆయన వేసిన క్వాష్ పిటిషన్ నేడు సుప్రీంలో విచారణకు రానుంది. చంద్రబాబు అరెస్టయి నెల రోజులైన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి సుప్రీం ఆదేశాలపైనే ఉంది. ఇక IRR, అంగర్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ పిటిషన్ లపై హైకోర్టు తీర్పులు ఇవ్వనుండగా…..బెయిల్, కస్టడీ పిటిషన్ పై ACB కోర్టు నిర్ణయం ప్రకటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news