చంద్రబాబు రాజకీయ రాక్షసుడు : సీఎం జగన్

-

చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఒంగోలు పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన హయాంలో పేదలకు సెంట్ స్థలం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తుంటే.. కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నాడు. ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే 1191 కేసులు వేయించాను. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు. చంద్రబాబు కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు.

చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయని తెలిపారు. వంద సినిమాల్లో ఉండే విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ అన్నారు. మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు. కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మడం లేదు. చంద్రబాబు 650 హామీలను ఇచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు. నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో వస్తున్నాడు. చంద్రబాబులా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు. బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని మాత్రమేనని తెలిపారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version