పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై చంద్రబాబు హర్షం

-

పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులు, నాయకులకు చంద్రబాబు అభినందనలు చెప్పారు. గతంలో వైసీపీ చేతిలో ఉన్న ఈ స్థానాలను.. ఉప ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకోవడం శుభ పరిణామమని.. వైసీపీ ప్రభుత్వం రోజు రోజుకూ ప్రజల మద్దతు కోల్పోతోందని వెల్లడించారు చంద్రబాబు.

అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు చైతన్యంతో వైసీపీని ఓడించి.. తెలుగు దేశం పార్టీని గెలిపిస్తున్నారని..ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కూడా కొన్ని చోట్ల పోలీసులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని.. వైసీపీ అక్రమాలకు తెగబడినా.. అన్నింటినీ ఎదరించి మరీ టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version