కుప్పం సీఐ తీరుపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు బరి తెగిస్తున్నారని.. డీజీపీ చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. బరితెగించిన పోలీసులను డీజీపీ అదుపులో పెట్టాలని.. ఒకప్పుడు దేశంలోనే పేరున్న ఏపీ పోలీసులు..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రోజు రోజుకూ దిగజారుతున్నారని ఆగ్రహించారు.
కొందరు పోలీసుల తీరు శాఖకే తలవంపులు తెచ్చిపెడుతోందని.. తప్పు చేసిన పార్లమెంట్ సభ్యులను సమర్థించే నీచ స్థాయికి కొందరు పోలీసులు వెళ్లడం దారుణమని చంద్రబాబు ట్వీట్ చేశారు. వైసీపీ ఎంపీపై చర్యలు కోరుతూ కుప్పంలో చేపట్టిన నిరసనల సందర్భంగా… దేశాన్ని కాల్చండి అంటూ స్వయంగా ఒక సీఐ వ్యాఖ్యలు చెయ్యడాన్ని డీజీపీ సమర్థిస్తారేమో గాని ప్రజలు హర్షించరన్నారు.
నిందితులకు బహిరంగంగా పోలీసులు మద్దతు పలకడమే కాకుండా.. నిరసనలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ కుప్పం నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వివరించారు. మాపై తప్పుడు కేసులు మాని.. బరి తెగించిన అధికారులను అదుపులో పెట్టి పోలీసుశాఖ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత డీజీపీ పై ఉందని పేర్కొన్నారు.
ఒకప్పుడు దేశంలోనే పేరున్న ఏపీ పోలీసులు..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకూ దిగజారుతున్నారు. కొందరు పోలీసుల తీరు శాఖకే తలవంపులు తెచ్చిపెడుతోంది. తప్పు చేసిన పార్లమెంట్ సభ్యులను సమర్థించే నీచ స్థాయికి కొందరు పోలీసులు వెళ్లడం దారుణం.(1/3)@APPOLICE100 pic.twitter.com/2BTX51pYCV
— N Chandrababu Naidu (@ncbn) August 7, 2022