చంద్రబాబుకు షాక్ తగిలింది. అనుమతి లేకుండా అమెరికాకు..చంద్రబాబు వెళ్లినట్లు సమాచారం. ఫైబర్‌నెట్ కేసులో సుప్రీంలో విచారణ కొనసాగుతోంది. దీంతోశంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్నారట ఇమ్మిగ్రేషన్ అధికారులు. అయితే… సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి ఇచ్చారట.
పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ పై సిఐడి గతంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సిఐడి అదనపు డీజీ అనుమతి లేనిదే వారు విదేశాలకు వెళ్లకూడదు. అనుమతి తీసుకోకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లాలనుకున్నారు.
మరోవైపు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు విచారణలో ఉండగా చంద్రబాబు కోర్టుకు సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లాలనుకోవడం విశేషం. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాసేపు చర్చ జరిగింది. సిఐడి అధికారుల వివరణ తీసుకున్నారు. ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు అనుమతి లభించింది. దీంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లారు. ఇప్పటికే లోకేష్ అమెరికాకు వెళ్లారట.