ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

-

ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు…అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు…. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.

chandrababu on Cyclone Fengal

అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచనలు చేశారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్న సీఎం చంద్రబాబు..ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news