యూసీసీపై ముస్లిం వర్గానికి అండగా నిలుస్తాం – చంద్రబాబు

-

యూసీసీపై ముస్లిం వర్గానికి అండగా నిలుస్తామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబుతో భేటీలో యూసీసీ బిల్లుకు మద్దతివ్వొద్దని కోరారు ముస్లిం మత పెద్దలు. కేంద్రం ప్రతిపాదిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలిపారు మత పెద్దలు, నేతలు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ముస్లిం వర్గ మనోభావాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎప్పుడూ పని చేయదని… యూసీసీపై ముస్లిం వర్గానికి అండగా నిలుస్తామని ప్రకటించారు.

యూనిఫాం సివిల్ కోడ్ పై ముస్లిం వర్గం నుంచి వచ్చిన సూచనలపై అధ్యయనం చేస్తామని.. ముస్లిం మత విశ్వాసాలకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. బిల్లు విషయంలో మైనారిటీ వర్గ అభిప్రాయాలను టీడీపీ గౌరవిస్తుంది.. అందరి మనో భావాలు కాపాడుకుందామన్నారు. మహిళలకు ఆస్తిలో 1/3 వాటా ఇవ్వాలని పవిత్ర ఖురాన్ లో నాడే పొందుపరిచారని.. ఎన్టీఆర్ నాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం చేశారన్నారు. మహిళల హక్కుల విషయంలో టీడీపీ మొదటి నుంచి ఆ వర్గానికి అండగా ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version