ఆ చిన్న తప్పే మురళీమోహన్ ఆస్తులను కాజేసిందా..?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని కారణాలవల్ల ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఒకరు అని చెప్పవచ్చు. రాజకీయాలకు గుడ్ బై చెప్పినా.. సినిమాలతో బిజీగానే గడిపేవారు. అయితే ఇప్పుడు వయసు మీద పడడంతో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్నారని చెప్పాలి. కానీ నిర్మాణరంగం తో పాటు బిజినెస్ రంగంలో కూడా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం వయోభారరీత్యా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి కారణం ఆయన స్నేహితుడు స్వర్గీయ శోభన్ బాబు అని చెప్పవచ్చు.

ఇకపోతే జయభేరి పేరుతో భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఈయన 350 కి పైగా సినిమాలలో నటించి 25 కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ పలు విషయాలను వెల్లడించారు. వ్యాపారంలో సక్సెస్ పొందిన సమయంలో సినిమాలలోకి వెళ్లాలా వద్దా అని అనిపించిందని ఆయన తెలిపారు. ఇకపోతే ఆ రోజుల్లోనే చిరంజీవి తనను అన్నయ్య అని పిలిచేవారని.. ఇక మణిరత్నం దర్శకత్వం వహించిన ఇద్దరు సినిమాతో సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకున్నారని ఆయన వెల్లడించారు.

మహేష్ బాబు అతడు సినిమా ఆరు నెలల్లోనే పూర్తి కావలసిన సినిమా షూటింగు 18 నెలల్లో పూర్తి చేయవలసి వచ్చిందని తెలిపారు. ఇకపోతే సినిమా రంగంలో ఎన్నేళ్లు ఉన్నా కూడా కొన్ని అలవాట్లకు బానిస కావద్దని తాను అనుకున్నానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాను నిర్మించిన సినిమాలలో 75% సినిమాలు సక్సెస్ అయ్యాయని మురళీమోహన్ వెల్లడించారు. మొత్తానికైతే ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version