ఏపీకి భారీ వర్షాలు… చంద్రబాబు కీలక ఆదేశాలు

-

ఏపీకి భారీ వర్షాలు పడనున్నట్లు తరుణంలో…సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించిన సిఎం చంద్రబాబు… రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయిందని తెలిపారు.

Chandrababu Sarkar alert in the background of heavy rains in AP

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందని ఆయన వివరించారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి…పర్యవేక్షణ ఉంచాలని… అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని కోరారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలని… చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని… రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version