జగన్‌ ను ఏపీలోని కుక్కలు కూడా భరించ లేకపోతున్నాయి – చంద్రబాబు

-

జగన్‌ ను ఏపీలోని కుక్కలు కూడా భరించ లేకపోతున్నాయని ఆగ్రహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ భవిష్యత్ కాదు.. నమ్మకం కాదు. జగన్ రాష్ట్రానికి దరిద్రం అని రెచ్చి పోయారు చంద్రబాబు.కొడాలి నాని..ఓ బూతుల ఎమ్మెల్యే అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. బూతుల ఎమ్మెల్యే రోడ్ వేయలేదు కానీ.. పేకాట క్లబ్బులు.. క్యాసినో తెచ్చాడు.. పేకాట క్లబ్బులు తెచ్చినా ప్రజలకు కోపం రాదన్నారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేపడుతున్నామని… ఇవాళ్టీ నుంచి వచ్చే నెలలో రాజమండ్రిలో పెట్టే మహానాడు నాటికి వంద సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ పోటీ చేసి.. గెలిచిన తులసీ వనం లాంటి గుడివాడలో గంజాయి మొక్క లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారని కొడాలి నానిపై సీరియస్‌ అయ్యారు. రాష్ట్రంలో నాలుగేళ్లల్లో ఏ ఒక్కరూ ఆనందంగా లేరన్నారు. నేను విమర్శలు చేయాలంటే చాలా చేస్తానని… బూతుల ఎమ్మెల్యేకు తగ్గట్టు మా తమ్ముళ్లు చాలా బూతులు తిట్టగలరని తెలిపారు. ఇక్కడి ఎమ్మెల్యేకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే వెల్లడించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version