బ్రేకింగ్ : సీఐడీ కస్టడికి చంద్రబాబు.. అనుమతిచ్చిన ఏసీబీ కోర్టు

-

విజయవాడ సీఐడీ కోర్టులో చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే తీర్పు వాయిదాల మీద వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నాం 2.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు ఏసీబీ కోర్టు జడ్జి వెల్లడించారు. తొలుత ఇవాళ ఉదయం 10:30గంటలకు కస్టడీ పిటిషన్‌పై తీర్పుపై న్యాయమూర్తి చర్చించారు. నేటి మధ్యాహ్నం 1.30కు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏసీబీ కోర్టు జడ్జి తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

CC

చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. బుధవారం సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే లు సుదీర్ఘంగా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తీర్పుపై మాత్రం ఏసీబీ కోర్టు రిజర్వు చేశారు. క్వాష్ పిటిషన్‌ ని ఏపీ హైకోర్టు కొట్టి వేసినట్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఏసీబీ కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.చంద్రబాబు 5 రోజుల కస్టడీని కోరింది ఏపీ సీఐడీ. కానీ ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు కస్టడికి సీఐడీ విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. విచారణ ఎక్కడ చేపడుతానరనే విషయం ఇంకా క్లారిటీ లేదు. సీఐడీ చెప్పేదానిని బట్టి ఆదేశిస్తాం అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ చేపడుతామని సీఐడీ జడ్జీకి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version