జగన్‌ వర్సస్‌ కేసీఆర్‌.. బాబూ ఎటువైపు

-

AP-Telangana water dispute టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు గొప్ప చిక్కే వ‌చ్చిప‌డింది. నీళ్ల విష‌యంలో ఇప్పుడు జ‌గ‌న్ వ‌ర్సెస్ కేసీఆర్ జ‌ల‌ఖ‌డ్గాలు దూసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ ఎత్తు పెంచుతామ‌ని, కాల్వ లు వెడ‌ల్పు చేస్తామ‌ని, త‌ద్వారా క‌న్నీటి క‌ష్టాలు అనుభ‌విస్తున్న సీమ‌కు నీరిస్తామ‌ని జ‌గ‌న్ చెబుతున్నా రు. దీనికి సంబంధించి దాదాపు 4 వేల కోట్ల‌ను కూడా ఇటీవ‌ల ఆయ‌న విడుద‌ల చేశారు. ఆయా ప‌నులు చేప‌ట్టేందుకు టెండ‌ర్లు పిలిచేందుకు జీవోలు కూడా విడుద‌ల చేశారు. అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌తో దోస్తీ క‌ట్టిన కేసీఆర్ దీనిని విభేదించి.. నేరుగా కేంద్రానికి, సుప్రీం కోర్టుకు వెళ్లారు.

మ‌రోప‌క్క‌, కీల‌క‌మైన కృష్ణాబోర్డుకు కూడా కేసీఆర్ గ్రూప్ ఫిర్యాదు చేసింది. ఈ విష‌యం ఇప్పుడు ఇరు రా ష్ట్రాల మ‌ధ్యా తీవ్ర‌మైన క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఒక‌వైపు జ‌గ‌న్ త‌న ప‌ట్టును ఎట్టిప‌రిస్థితిలోనూ వీడేది లేద‌ని చెబుతున్నారు. ఇది ఏపీ హ‌క్కు అంటూ ఆయ‌న వాదిస్తున్నారు. మ‌రోప‌క్క‌, కేసీఆర్ కూడా త‌న ప‌ట్టును విడ‌వ‌రాద‌నే నిర్ణ‌యించుకున్న‌ట్టు తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌ల వివాదం కాస్తా.. రాజ‌కీయ వివాదంగా మారుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఓ విప‌క్ష నేత‌గా ఎలా రియాక్ట్ అవుతారు? అనేది కీల‌కంగా మార‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌తి విష‌యంలోనూ బాబు స్పందిస్తారు. ఏపీ విష‌యంలో అయితే, పూర్తిగా ఆయ‌న రియాక్ష‌న్ ఉంటుంది. అదేస‌మ‌యంలో తెలంగాణ విష‌యంలో మాత్రం ఆయ‌న ఇటీవ‌ల కాలంలో ఏ విష‌యంపై స్పందించ డం లేదు. మ‌రి ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన విష‌యం వ‌చ్చింది. రాయ‌ల‌సీమ‌కు నీరివ్వాలంటే.. పోతిరె డ్డిపాడు ఎత్తును పెంచ‌డం, కాల్వ‌ల‌ను వెడ‌ల్పు చేయ‌డం త‌ప్ప‌ద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. దీనిని బాబు స‌మ‌ర్ధిస్తారా? త‌ప్పుబ‌డ‌తారా? అనే దానిపైనే రాజ‌కీయం అంతా ఆధార‌ప‌డి ఉంది. వెడ‌ల్పు, ఎత్తులు త‌ప్పు.. అంటే.. సీమ ప్ర‌జ‌ల్లో బాబు మ‌రింత చుల‌క‌న అవుతారు.

రాజకీయంగా వైసీపీకి మ‌రింత టార్గెట్ అవుతారు. పోనీ.. వీటిని స‌మ‌ర్ధిస్తే.. రెండు ర‌కాలుగా బాబు బ‌ద్నాం అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పోతిరెడ్డి పాడు ఎత్తు, కాల్వ‌ల వెడ‌ల్పు అంశాన్ని జ‌గ‌న్ ప్ర‌తిష్టా త్మ‌కంగా తీసుకుంది. వీటిని బాబు స‌మ‌ర్ధిస్తే.. జ‌గ‌న్ విజ‌న్‌ను స‌మ‌ర్ధించిన‌ట్టే. మ‌రోప‌క్క‌, కేసీఆర్ ఆగ్ర హానికి గురి కావ‌డం త‌ప్ప‌దు. పోనీ.. ఈ గొడ‌వ నాకెందుకులే.. అని బాబు మౌనం పాటించినా.. వైసీపీ నేత‌లు ఏకేయ‌డం ఖాయం. సీమ‌లో ఓటు బ్యాంకుకే ప్ర‌మాదం.. ఇలా మొత్తంగా పోతిరెడ్డి పాడు వ్య‌వ‌హారం బాబు నెత్తిన శ‌నిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version