BREAKING : రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు నాయుడును తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. చంద్రబాబు నాయుడును కోర్టు రిమాండ్‌కు పంపితే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉండటంతో విజయవాడ – రాజమండ్రి రహదారిని ఆధీనంలోకి తీసుకుని వాహనాలు సిద్ధం చేస్తున్నారు పోలీసులు.
చంద్రబాబు కేసును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మీడియాను సైతం కోర్టు పరిసరాల నుంచి దూరంగా పంపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులు అరెస్ట్ టిడిపి అధినేత చంద్రబాబు A-1గా ఉన్నారని తోలుత వార్తలు వచ్చాయి. అయితే సిఐడి అధికారులు తాజాగా విజయవాడ ACB కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో A-37గా చంద్రబాబుని పేర్కొనగా…A-1గా గంట సుబ్బారావు పేరును చేర్చారు.