సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా విజయవాడలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పుడు నక్సలైట్లు లేరని.. నక్సలైట్లు ఉంటే వారిని కూడా బుట్టలో వేసుకునే వారని విమర్శలు చేశారు సజ్జల. తాను వెనుక ఉండి యుద్ధం చేస్తుంటారు. విజయవాడ, గుంటూరు కు చంద్రబాబు ఉరి వేశాడు.
ముఖ్యంగా 2014-19 వరకు విజయవాడలో చంద్రబాబు ఒక్క అభివృద్ధి పని కూడా ఎందుకు చేయలేదన్నారు. కరకట్టను ఎందుకు డబుల్ రోడ్డు చేయలేదని మండిపడ్డారు. విజయవాడలో కనకదుర్గమ్మ వారధిని ఎందుకు నిర్మించలేకపోయాడని ప్రశ్నించారు. రాజధాని కట్టొద్దని ఎవరైనా చెప్పారా..? తాత్కాలిక భవనాలు అని ఎందుకు చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడం కోసమే పార్టీలో మార్పులు చేస్తున్నట్టు తెలిపారు సజ్జల. ఈనెల 27 నుంచి వరుస సభలుంటాయని.. ఎల్లుండి భీమిలిలో సీఎం జగన్ సభ ఉంటుందని తెలిపారు.