స్వచ్ఛాంధ్ర, బీసీ సంక్షేమ శాఖ పై చంద్రబాబు సమీక్ష

-

స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్, బీసీ సంక్షేమ శాఖ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సోర్స్ రీ సోర్స్ అంశాన్ని థీమ్ గా తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారన్నారు. వారి హత్యలపై విచారణ వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలి అన్నారు. ఇదే అంశం మ్యానిఫెస్టోలో కూడా పెట్టమని ఆయన తెలిపారు. దీంతో పాటు బీసీ విద్యార్థుల డైట్ బకాయిలు వెంటనే చెల్లించండి అని తెలిపారు.

నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ స్కూళ్లను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని
అధికారులకు సీఎం సూచించారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం రూపొందించాలన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కోసం అవసరమయితే న్యాయ పోరాటం చేయ్యాలన్నారు. ప్రతి కార్పొరేషన్ కు దామాషా ప్రకారం నిధులను కేటాయించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news