బాలికల గురుకుల పాఠశాలలో కిడ్నాప్ కలకలం..!

-

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కిడ్నాప్ కలకలం రేపింది. బోర్లం గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుశీత వాళ్ల నాన్న ఆరోగ్యం బాగాలేదని, పెదనాన్న కుమారుడు సంజయ్ భార్గవ్ సుశీతను మాయ మాటలు చెప్పి బైక్ పై కూర్చోపెట్టుకుని హైదరబాద్ వైపు వెళ్ళాడు. మోండి సడక్ వద్ద బైక్ టైర్ పంచర్ కావడంతో.. బైక్ ఆపి పంక్చర్ చేయిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి అమ్మాయి అన్నకు ఫోన్ చేశారు.

దీంతో అదేమీ లేదు అని.. అమ్మాయిని జాగ్రత్తగా చూస్కుండి.  నేను వస్తున్ననని చెప్పడంతో..కిడ్నాప్ చే స్తున్నట్లు అనుమానం వచ్చి స్థానికులు చితక బాది పోలీసులకు అప్పగించారు.ఈ సంఘటన జరగటానికి ముఖ్య కారణం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమేనని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ, గురుకుల పాఠశాల సిబ్బంది తమ తీరు మార్చుకోలేదని మండి పడుతున్నారు. ఇప్పటికైన తమ హాస్టల్ పిల్లల పట్ల శ్రద్ధ చూపి,ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news