ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆయన రేపు ఢిల్లీకి వెళతారు అని ముందుగా సీఎం క్యాంపు కార్యాలయం ప్రకటించగా.. తాజాగా దానిని ఈరోజు రాత్రికే వెళ్లనున్నట్లుగా సీఎం క్యాంపు కార్యాలయం తెలిపింది. ఈ రోజు రాత్రి 10.15 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడి తో ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.
రేపు రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది.