కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తన వాదనలు వినిపించుకునే చెవిరెడ్డి భావోద్వేగం అయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని, వారి మృతితో తాను మద్యం జోలికి వెళ్లలేదని న్యాయమూర్తికి చెప్పారు భాస్కర్ రెడ్డి.

చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నందుకు బాధగా ఉందని కంటతడి పెట్టుకున్నారు. కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన పిఏ బాలాజీ కుమార్ యాదవ్ కు సిట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట వద్ద టోల్ గేట్ సమీపంలో రూ. 8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనపై ఆయన వివరణ ఇవ్వాలని సిట్ ఆదేశించింది.
అలాగే ఇండోర్ లో బాలాజీ అరెస్టు అయిన సమయంలో తాము సీజ్ చేసిన రూ. 3.50 లక్షల సొమ్ము లిక్కర్ స్కాం దేనిని భావిస్తున్నామని దీనిపైన సమాధానం ఇవ్వాలంటూ సిట్ పేర్కొంది. దీనిపైన వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.