ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇకపైన గురుకుల విద్యార్థులకు చికెన్ బంద్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు అలాగే ఈఎంఆర్ఎస్ స్కూల్స్ విద్యార్థులకు చికెన్ నిలిపివేస్తున్నట్లు గురుకుల సెక్రటరీ సదా భార్గవి అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో వేలాది కోళ్లు మరణిస్తున్నాయి.
ఈ తరుణంలోనే చికెన్ తినేందుకు జనాలు భయపడిపోతున్నారు. ఇటు గురుకులాల లో చదివే విద్యార్థులకు కూడా చికెన్ నిలిపివేస్తున్నట్లు అధికారులు… ప్రకటన చేయడం జరిగింది. చికెన్ కు బదులుగా గుడ్లు అలాగే స్వీట్లు అటు వెజ్ కర్రీలు అందిస్తామని అధికారిక ప్రకటన చేశారు సెక్రటరీ సదా భార్గవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రయ పాఠశాలల్లో చికెన్ పెట్టకూడదని ఆమె ఆదేశాలు ఇవ్వడం.. జరిగింది.