నేడు అన్నమయ్య జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు చంద్రబాబు.
సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు… ఉదయం 11:10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.
మధ్యాహ్నం 12:05 గంటల కు కడప ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12:20 కి సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ చేరుకోనున్న సీఎం చంద్రబాబు… మధ్యాహ్నం 12:40 గంటలకు హెలిపాడ్ నుండి కాన్వాయ్ ద్వారా సంబేపల్లి కు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు సంబేపల్లిలోని దళిత మహిళ మంగమ్మ తోపాటు బీసీ వర్గానికి చెందిన గోర్ల వెంకటేష్ (వికలాంగుడు) ల ఇంటికి వెళ్లి వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును అందజేస్తారు బాబు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు చంద్రబాబు. సంబేపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. పిఎన్ కాలనీ నుంచి హెలికాప్టర్ లో కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు చంద్రబాబు. కడప నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు.