ఏపీ ప్రజలకు అలర్ట్..జూన్ లో మరో 3 పథకాలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ లో మరో 3 పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు.
అన్నదాత సుఖీభవ కింద రైతుకు రూ.20 వేలు ఇస్తామని వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారుల భరోసా కింద వేటకు వెళ్లని రోజుల్లో రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు.