ఇవాళ, రేపు చంద్రబాబును విచారించనున్న ఏపీ సీఐడీ

-

స్కిల్ డెవలప్మెంట్ సంస్థ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయణ్ను కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ వేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. రెండ్రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జ్యుడిషియల్‌రిమాండులో ఉన్న చంద్రబాబుని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని సూచించింది. శని, ఆదివారాలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారించాలని, గంటకోసారి అయిదు నిమిషాల విరామం ఇచ్చి. న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది.

చంద్రబాబుపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించరాదని ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కస్టడీకి తీసుకునే ముందు ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని చెప్పింది. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొంది. ‘విచారణ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని విచారణ కనిపించే దూరం వరకూ అనుమతించాలి. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామమివ్వాలి. విచారణ సమయంలో అవసరమైన వైద్య సదుపాయం కల్పించాలి. కస్టడీ గడువు ముగిశాక ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫెరెన్స్‌ద్వారా చంద్రబాబును న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలి అని ఏసీబీ కోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. మరోవైపు చంద్రబాబు పిటిషన్లన్నీ సోమవారం రోజున విచారణ చేస్తామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version