స్వర్ణాంధ్ర 2047 సాధనకు తోడ్పాటు అందివ్వాలని నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. తాజాగా సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ బృందం సమావేశం అయింది. ఈ సందర్భంగా అభివృద్ధి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. ఏపీ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని నీతి అయోగ్ సహకారం కూడా చాలా అవసరం అని తెలిపారు.
తొలుత వైస్ చైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని నీతి అయోగ్ బృందానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలకగా.. ఏపీ విజన్ 2047 సహా ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి నిర్మాణం నీతి అయోగ్ బృందానికి, సీఎం చంద్రబాబుకి మధ్య చర్చలు కొనసాగాయి. ఏపీ కి ఆర్థికంగా అండగా ఉండేలా నిర్నయాల పై సీఎం కోరారు. ఏపీకి ఉన్నటువంటి అప్పులు వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. చర్చల అనంతరం నీతి అయోగ్ చైర్మన్ కు వీడ్కోలు చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు.