చాలా మంది భగవంతుడిని ఆరాధించడానికి ఎన్నో రకాల పూజలను చేస్తారు. పూజలు చేయడం వలన ఎన్నో మంచి ఫలితాలను పొందవచ్చు అని కూడా నమ్ముతారు. అయితే పూజకి పూలు ఎంతో అవసరం. కొంతమంది ఎలాంటి పూలను ఉపయోగించి పూజ చేయాలి అని కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా కొన్ని పూలను ఉపయోగించకూడదు అని నియమాలను కూడా పాటిస్తారు. ఇంట్లో పెద్దవారు పూలను వాసన చూస్తున్నప్పుడు దేవుడికి ఉపయోగించే పూలను అయితే వాసనను చూడొద్దు అని కూడా చెబుతూ ఉంటారు. పూజించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ఎక్కువగా ప్రవహిస్తుంది. దీంతో ఎంతో సంతోషంగా మరియు ఆనందంగా జీవించవచ్చు.
ఉదయం మాత్రమే కాకుండా సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది అని చాలా శాతం మంది నమ్ముతారు. పూజ చేస్తున్నప్పుడు ప్రతి విషయానికి కొన్ని నియమాలు ఉంటాయి. దీపారాధనకు ఏ విధంగా అయితే నియమాలు ఉంటాయో పూజించే పువ్వులకు కూడా నియమాలు ఉంటాయి. భగవంతునికి పూజించేటప్పుడు తప్పకుండా పూలు అనేవి అవసరం. పూలను ఉపయోగించి పూజించడం వలన వాటి పరిమళం మన చుట్టూ ఉండే వాతావరణంలో వ్యాపిస్తుంది. ఈ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. దీంతో సానుకూల శక్తి ఎంతో పెరుగుతుంది.
ఎక్కడ పూజించినా సరే చిన్నగా మరియు ప్రకాశంంతమైన పూలను మాత్రమే ఉపయోగించాలి. కొంతమంది పూలను కొమ్మలతో సమర్పిస్తూ ఉంటారు అయితే కొమ్మ దేవతల వైపు ఉండే విధంగా మరియు పువ్వు రేఖలు మన వైపు ఉండేటట్టుగా పూజించాలి. అదేవిధంగా బంతి పువ్వులను పూజించకూడదు. చాలామంది బంతి పువ్వులు ఎంతో అందంగా ఉంటాయని వాటిని పూజలకు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బంతి పూలకు శాపం ఉండడం వలన వాటిని పూజకు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. బంతిపూలతో పూజ చేయడం వలన ఎటువంటి ఫలితం ఉండదు. కేవలం బంతిపూలను దండలకు మరియు అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి.