గత ప్రభుత్వం వల్లే పోలీసుల ఇలా తయారయ్యారు : సీఎం చంద్రబాబు

-

సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్ లో కీలక చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులపై చర్చ లేవనెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కొంత మంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారు. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. కొంత మంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు వత్తాసు పలికిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారు. ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం.

కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేసినా రియాక్టు కావడం లేదు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారు. ఇంట్లో మహిళల పైనా పోస్టులు పెడితే ఊరుకోవాలా?…అందువల్లే నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు.. గత ప్రభుత్వం వల్లే పోలీసుల ఇలా తయారయ్యారు. అందర్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నెల రోజుల్లో పోలీస్ వ్యవస్థలను గాడిలో పెడతా. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తా అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version