సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. నాగబాబు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల తుది జాబితా పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
పలు రాజకీయ అంశాలు, పాలసీల పై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య జరగనున్న చర్చ ఉంటుందట. ఇది ఇలా ఉండగా.. నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డులు కూడా మంత్రి పదవిని ఆశించారు.. పార్టీలో చేరే సమయంలో తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని కోటంరెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకున్నారట. దీంతో ఒక్క ఖాళీ తమ కోసమే ఎదురుచూస్తుందని అందరూ భావించారు.. కానీ చంద్రబాబు వారందరికీ షాక్ ఇచ్చారు.. ఎవ్వరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.. చంద్రబాబు క్యాబినెట్ లో 25వ మంత్రి కాబోతున్నారు.